ఇంకెన్ని అవకాశాలు ఇవ్వాలి కేటీఆర్ బాబూ.. కొంచెమైనా ఉండొద్దా?

by Disha Web Desk 2 |
ఇంకెన్ని అవకాశాలు ఇవ్వాలి కేటీఆర్ బాబూ.. కొంచెమైనా ఉండొద్దా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ సభలో యువతకు ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్ పలు హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇంకా ఎన్ని సార్లు అవకాశం ఇస్తారు కేటీఆర్ బాబు. కొంచెం.. ఉండాలి కదా! కేసీఆర్ గత తొమ్మిదిన్నర ఏళ్లలో ఒక్కసారైనా 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా కల్పించాలి అని అధికారులతో సమావేశం పెట్టారా? ఇంకా ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు బాస్’ అంటూ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని, వాళ్లూ అంతేనని పేర్కొన్నారు. అబద్దాల దుర్మార్గపు పరిపాలనను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని, తెలంగాణ యువత మరో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.Next Story

Most Viewed