- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
నల్గొండ బీఆర్ఎస్ లీడర్లకు షాక్.. సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటి రెడ్డి లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో: దళిత, బీసీ బంధుల్లో అవినీతి జరుగుతోందని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పథకాల్లో కమీషన్ల రాజ్యం కొనసాగుతుందని ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పేదల నుంచి గుంజుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గాల పరిధిలోని దళితబంధు, బీసీబంధు మంజూరైన లిస్ట్ పరిశీలిస్తే.. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనర్హులకు కూడా మంజూరు చేశారని విమర్శించారు. తిప్పర్తి మండలం హెడ్ క్వార్టర్స్‌లో 566 మంది దళిత కుటుంబాలు ఉంటే.. కేవలం 12 దళిత బంధు యూనిట్ లు ఇచ్చారన్నారు.
అది కూడా బీఆర్ఎస్ సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు ఇవ్వడం విచిత్రంగా ఉన్నదన్నారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో ఘోరమైన స్కాం జరిగిందని.. అక్కడ 30% కమిషన్ తీసుకుంటూ బీసీబంధు, దళితబంధు యూనిట్లు మంజూరు చేశారని ఆరోపించారు. తిరుమలగిరిని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి రూ.180 కోట్లు మంజూరు చేస్తే.. దాదాపు 60 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉన్నదని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. పేదలకు అందాల్సిన స్కీమ్‌లపై దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉన్నదని ఆయన లేఖలో కోరారు.