కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎంలపై హరీష్ రావు సీరియస్

by Disha Web Desk 2 |
కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎంలపై హరీష్ రావు సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నాటకలో ప్రతి రోజు ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అక్కడి నేతలు ఏం ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లు అడుగుతున్నారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కర్నాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు ప్రచారం చేయడంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వారికి ఏం చూసి ఓట్లు వేయాలని నిలదీశారు. బాచూపల్లిలో కేఎల్ యునివర్సిటీ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. మా రాష్ట్రంలో 5 గంటలే కరెంటు ఇస్తున్నామని డీకే శివకుమారే స్వయంగా ఒప్పుకున్నారు. మీ ఇల్లే సరిగా లేదు ఇక్కడికి వచ్చి మాకు నీతులు చెబుతారా అని నిలదీశారు. కాంగ్రెస్ గెలిస్తే కంట్రోల్ అంతా ఢిల్లీలో, కర్నాటకలో ఉంటదన్నారు.

ఆ పార్టీలో టికెట్లు కావాలంటే ఢిల్లీకి, డబ్బులు కావాలంటే కర్నాటకు, ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు రావాల్సి ఉంటుందని ఎద్దేనా చేశారు. కృష్ణా జలాలు, ఐటీ వివాదాలు వస్తే కర్నాటక ప్రభుత్వాన్ని దిక్కరించి తెలంగాణ హక్కులను ఈ కాంగ్రెస్ పార్టీ కాపాడగలదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బ్రిజేష్ ట్రిబ్యునల్ పంచాయతీ ఉంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎటు వైపు ఉంటారని ప్రశ్నించారు. కాళ్ళు మొక్కేవాళ్లు, అడుగులకు మడుగులు వొత్తే వాళ్ళు తెలంగాణ ప్రయోజనం ఏం కాపాడగలని, తెలంగాణ రక్షణ కేసీఆర్ వల్లే సాధ్యం అవుతుందన్నారు.

Next Story

Most Viewed