ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల స్ట్రాంగ్ వార్నింగ్

by Disha Web Desk 2 |
ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, దుబ్బాక: ఎన్నికల వేళ మావోయిస్టుల లేఖలు జిల్లాలో కలకలం రేపాయి. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి గ్రామ శివారులోని ఎదుల్లా చెరువు వద్దనున్న మత్తడి పిల్లర్లకు వాల్ పోస్టర్లు ప్రత్యక్ష్యం అయ్యాయి. ‘తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా రైతులు, చేనేత, కార్మిక వర్గం విలవిలాడుతోంది. పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్, ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న పరిస్థితి ఇంకా ఉంది. ఆయా పార్టీలు స్వార్థం కోసం కలుషిత రాజకీయం చేస్తున్నారు. యువత మద్యం డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. బీఆర్ఎస్ ఇసుక మాఫియా, కబ్జాలు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.. ఎదిరించిన వారిపై (యూఏపీఏ) uapa చట్టం ప్రయోగిస్తూ మర్డర్‌లు చేస్తున్నారు.

మేధావులు, యువతను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బీఆర్ఎస్ బడ నాయకుల అండదండలతో గ్రామ, మండల, జిల్లా బీఆర్ఎస్ నాయకులు ప్రజలపై పెత్తనం చేలాయిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు చేలాయిస్తున్న పెత్తనాన్ని పీడిత ప్రజలంతా ఐక్యంగా ప్రతిఘటించాలి, ఎదుర్కోవాలని పిలుపునిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు కొనసాగిస్తున్న దోపిడీ విధానాలను దౌర్జన్యాలను ఆపకపోతే ప్రజల సమక్షంలో శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ప్రజల వారసత్వ సహజ సంపద అయిన మైనింగ్‌ను వారి సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మేధావులు, యువత మైనింగ్‌ను రక్షించుకోవాలి.’ అంటూ పోస్టర్లు అతికించారు.

Next Story

Most Viewed