నన్ను కొనే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు: రాజగోపాల్ రెడ్డి

by Disha Web Desk 2 |
నన్ను కొనే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు: రాజగోపాల్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 90 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 70MM లో సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ సినిమా చూపిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచంలో తనను కొనే శక్తి ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తమ లక్ష్యమన్నారు. గత మునుగోడు ఉప ఎన్నికల్లో నైతిక విజయం తనదే అన్నారు. గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఏఐసీసీకి చెప్పా.. నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానమే అని తెలిపారు. ఏదిఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవడం ఈసారి ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఓటమిని చూడాలని, ఓడించడంలో భాగస్వామ్యం కావాలనే సొంతగూటికి వచ్చానని అన్నారు.


Next Story