తెలంగాణ టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా

by GSrikanth |
తెలంగాణ టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: అందరూ ఊహించినట్లుగానే తెలంగాణ టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అంతా సిద్ధం చేసుకున్నాక.. పోటీ చేయొద్దని చంద్రాబాబు చెప్పారని, ఈ నిర్ణయం తనను చాలా బాధించిందని లేఖలో పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తాను కార్యకర్తలకు చెప్పలేనని, అందుకే రాజీనామా చేశాననీ తెలిపారు. ఎన్నికల్లో పోటీ విషయమై మాట్లాడటానికి లోకేష్‌‌కు 20 సార్లు ఫోన్ చేసిన సమాధానం లేదని అసహనం వ్యక్తం చేశారు.

ఈసారి పోటీ చేయాల్సిందే అని తెలంగాణలోని పార్టీ కేడర్ మొత్తం కోరుతోందని.. దీనిని అధిష్ఠానం పట్టించుకోవట్లేదని లేఖలో ఆవేదన చెందారు. కాగా, కాసాని ఏ పార్టీలో చేరతారో అని ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియాలో మాత్రం ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.

Next Story