ఎన్నికల వేళ టీడీపీకి BIG షాక్.. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా?

by Disha Web Desk 2 |
ఎన్నికల వేళ టీడీపీకి BIG షాక్.. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా విషయమై ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో కాసాని ములాఖత్ అయ్యి చర్చించారు. ఈ చర్చల్లో ఎన్నికల్లో పోటీ దూరంగా ఉండాలని చంద్రబాబు కాసానికి సూచించారు. దీంతో ఇప్పటికే అనేకసార్లు తమ పార్టీ పోటీ ఉంటుందని, 30 మందితో అభ్యర్థుల తొలి జాబితా కూడా రెడీ ఉంటుందని కాసాని ప్రకటించారు. అయితే, చంద్రబాబును కలిసినాక అనూహ్యంగా పరిస్థితి తారుమారు కావడంతో కాసాని జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, బీఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధమైనట్లు ప్రచారం ఊపందుకున్నది.

Next Story