సీపీఐ శ్రేణుల్లో జోష్.. సీపీఎంకు షాక్

by Disha Web Desk 2 |
సీపీఐ శ్రేణుల్లో జోష్.. సీపీఎంకు షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో మరోసారి కమ్యూనిస్టు పార్టీకి ప్రాతినిథ్యం దక్కే అవకాశాలు కనిపిస్తున్నయి. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కూనంనేని సాంబశివరావు గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. ఇయితే కాంగ్రెస్‌తో పొత్తు వికటించి ఒంటరిగా బరిలో నిలిచిన సీపీఎంకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆ పార్టీ 19 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క చోట కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని పోటీకి దిగితే సీపీఐ మాదిరిగా కనీసం ఒక్క చోట అయినా గెలుపు అవకాశాలు ఉండేవనే చర్చ జరుగుతోంది.Next Story