నిస్సిగ్గుగా మళ్లీ వాళ్లనే ఎలా కొనసాగిస్తారు?

by Disha Web Desk 2 |
నిస్సిగ్గుగా మళ్లీ వాళ్లనే ఎలా కొనసాగిస్తారు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్షలు రెండోసారి కూడా రద్దు కావడం టీఎస్‌పీఎస్‌సీ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, సభ్యులందరినీ తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ్యాల భర్తీ విషయంలో ఇంత నిర్లక్షంగా వ్యవహరించడం దారుణమన్నారు. మొదటిసారి పేపర్ లీకైనప్పటికీ నిస్సిగ్గుగా అదే బోర్డును కొనసాగించారని, అయినా రెండోసారి పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ నమోదు చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటమేమిటని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పులను గుర్తించకుండా మొండిగా వ్యవహరిస్తుడడంతో పదే పదే ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. సరైన విధానంలో పరీక్షలు, పారదర్శకంగా నిర్వహించినట్లయితే ఈ పాటికే మెయిన్స్ ఫలితాలు వచ్చి, సఫలీకృతులైన వారు గ్రూపు-1 ఉద్యోగాలలో చేరేవారని అన్నారు. నిరుద్యోగుల అమూల్యమైన సమయం, ధనాన్ని వృథా కావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌‌పీఎస్‌సీదే కారణమని ఆరోపించారు.



Next Story

Most Viewed