కాంగ్రెస్‌లోకి తెల్లం వెంకట్రావ్.. ఆ రోజున పొంగులేటి సమక్షంలో చేరిక!

by GSrikanth |
కాంగ్రెస్‌లోకి తెల్లం వెంకట్రావ్.. ఆ రోజున పొంగులేటి సమక్షంలో చేరిక!
X

దిశ, బ్యూరో ఖమ్మం: భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య మీద బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ విజయం సాధించినట్లు సమాచారం అందుతుండటంతో.. సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరతుండటం హాట్ టాపిక్‌గా మారింది. తెల్లం వెంకట్రావ్ మొదటి నుంచీ పొంగులేటి అనుచరుడిగా ఉండటం, కాంగ్రెస్‌లో సిట్టింగ్ అభ్యర్థి అయిన పొదెం వీరయ్యకు సీటు కేటాయించడంతో కినుకు వహించి బీఆర్ఎస్‌లో చేరి సీటు దక్కించుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలుపు దిశగా పయనిస్తుండటంతో ఆ పార్టీలో చేరడమే బెటర్ అనే భావనలో ఉన్నాడని అనుచరులు అంటున్నారు.

Advertisement

Next Story