నంబర్‌ వన్ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి: భట్టి

by Disha Web Desk 2 |
నంబర్‌ వన్ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి: భట్టి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసి ప్రజల ప్రభుత్వం తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని కాంగ్రెస్ నేత, సీఎల్పీ భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మధిర సెగ్మెంట్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. నోరు తెరిస్తే అద్భుత ప్రాజెక్ట్ అని గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం కుంగుబాటుపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ఇప్పుడు నోరు విప్పకపోవడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం నిర్మాణం పేరిట లక్ష కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దోపిడీ అధికారంలోకి రాగానే కక్కిస్తామన్నారు.

మేడిగడ్డ మాదిరిగానే అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని నీళ్ళను నింపడానికి ఆ ప్రాజెక్టులు పనికిరావని జాతీయ సేఫ్టీ అధికారులు తేల్చి చెప్పారని దానిపై ఎందుకు విచారణకు కేసీఆర్ సిద్ధం కావడం లేదని నిలదీశారు. పదేళ్లుగా తెలంగాణ సంపదను బీఆర్ఎస్ పాలకులు దోపిడీ చేసినందునే ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన సంక్షేమాలకు సైతం కోత పెట్టారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంట్లో ఉన్న ఇద్దరికీ పింఛన్లు ఇస్తే.. ధనిక రాష్ట్రంలో ఒకరికి కోత కోసి ఒకరికి మాత్రం ఇస్తూ సంక్షేమంలో నెంబర్ వన్ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అన్నారు.

Next Story

Most Viewed