కాంగ్రెస్ గ్యారెంటీ కార్డును భద్రంగా దాచుకోండి.. భట్టి విక్రమార్క పిలుపు

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ గ్యారెంటీ కార్డును భద్రంగా దాచుకోండి.. భట్టి విక్రమార్క పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి అందజేస్తున్న గ్యారెంటీ కార్డును భద్రంగా దాచుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పవర్‌లోకి వచ్చాక వెంటనే నెరవేరుస్తామన్నారు. వంద రోజుల్లోనే గ్యారెంటీ కార్డును అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ గాంధీభవన్ ఆవరణలోని ఇందిరా భవన్‌లో అభయ హస్తం తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు హామీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.2500 రూపాయలు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. 500 కు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పిస్తామన్నారు. ఇచ్చిన హామీలన్నీ తు.చ తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత నలుగురికి వోల్వో బస్సు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తామని, తమతో వస్తే కర్ణాటక స్కీమ్‌లు చూపిస్తామని భట్టి సవాల్ విసిరారు.

Next Story