- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రూ.860 కోట్లుంటే.. మరి నేతల ఖాతాల్లో: షర్మిల

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్పార్టీ ఖాతాలోనే రూ.860 కోట్ల డబ్బుంటే.. మరి ఆ పార్టీ నేతల ఖాతాల్లో ఇంకెంత డబ్బు ఉంటుందోనని వైఎస్సార్‌టీపీ చీఫ్షర్మిల ఆరోపణలు చేశారు. అమెరికా పర్యటన అనంతరం తన పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో శనివారం లోటస్పాండ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇన్ని రోజులు పాదయాత్రలో నడిచింది తానే అయినా.. నడిపించేది మాత్రం ప్రజలేనని అన్నారు. వైఎస్సార్ ని ప్రజలు మరిచిపోలేదని పేర్కొన్నారు. తెలంగాణ విధానాలు చూస్తుంటే ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోందని విమర్శలు చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థ పాలనే నిదర్శనమని చురకలంటించారు. రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడులు వస్తే నిరుద్యోగ సమస్య ఎందుకు తీరడం లేదని ఆమె ప్రశ్నించారు.
చిన్న దొర విదేశాలకు షికారు కోసం మాత్రమే వెళ్లారని ఫైరయ్యారు. ఆంధ్ర సంస్థలను మూసివేస్తామని సీఎం కేసీఆర్ అన్నారనే సందర్భంగా వైఎస్సార్ వీసా అనే పదం వాడారని గుర్తుచేశారు. కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో రైతులకు పరిహారం ఇవ్వడం పై అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్లో డబ్బులున్న వారికే రాజ్యసభ పదవులు ఇస్తున్నారని షర్మిల ఆరోపణలు చేశారు. అనంతరం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. కేసీఆర్షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తారన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర అధికార పార్టీకి వణుకు పుట్టిస్తోందని, టీఆర్ఎస్ కు చెమటలు పడుతున్నాయన్నారు. తన పాదయాత్ర తెలంగాణ మొత్తం ఆరు నెలల పాటు కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేశారు.