ఇంతకంటే దారుణమైన అవమానం ఉంటుందా?

by Disha Web Desk 2 |
ఇంతకంటే దారుణమైన అవమానం ఉంటుందా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని రూపొందించిన యాదగిరి రావు బిల్లు క్లియర్ చెయ్యలేదని వచ్చిన ఓ ఆర్టికల్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. ఇంతకంటే దారుణమైన అవమానం తెలంగాణ పోరాట యోధులకు, మేధావులకు, కళాకారులకు వేరే ఉంటుందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమది ఉద్యమాల పునాదులపై, త్యాగాల ఊపిరితో ఏర్పడిన ‘పార్టీ, ప్రభుత్వం’ అని సిగ్గులేకుండా డబ్బా కొట్టుకునే కేసీఆర్ 85 సంవత్సరాల యాదగిరి రావు బిల్లు ఇప్పటికీ క్లియర్ చేయకపోవడం అన్యాయం అని ఆమె ఫైర్ అయ్యారు. పదవిలోకి వచ్చి తొమ్మిదేండ్లైనా ఈపాటి చిన్న రుసుము చెల్లించలేరా? అంటూ విమర్శలు గుప్పించారు.

‘‘మీ దొంగ కాంట్రాక్టర్లకు పైసలు పెంచి మరీ అడ్వాన్సులు ఇస్తారు కదా? ఇక్కడ చేతులు తడపలేరన్న లోకువా! అని నిలదీశారు. కమీషన్ల కక్కుర్తితో అసలు సిసలైన తెలంగాణవాదాన్ని, పోరాటపటిమను, నేర్పును అవమానిస్తారా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన తెలంగాణవాదం మీ అవినీతి పాలన చెరలో ఉంటే, మోసగాళ్లు, బంధిపోట్లు గద్దెనెక్కి రాష్ట్రాన్ని పీక్కుతింటున్నారని మండిపడ్డారు. లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచి, మీ జేబులు నింపుకుంటూ...తెలంగాణ కోసం పోరాడిన వారికి మాత్రం వెన్నుపోటు పొడుస్తున్నారా అంటూ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు.



Next Story

Most Viewed