మధ్యాహ్నం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఆ అంశాలపై చర్చపై ఉత్కంఠ!

by Rajesh |
మధ్యాహ్నం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఆ అంశాలపై చర్చపై ఉత్కంఠ!
X

దిశ, వెబ్‌డెస్క్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు సోమవారం కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు మధ్యాహ్నం లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. రేపు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. ఈ నెల 21న రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇక, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌తో పాటు కుల గణన, అధిక ధరలు, నిరుద్యోగం సరిహద్దులో చైనా చొరబాటు, మణిపూర్ హింసపై చర్చ జరపాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. కాగా మొదటి నుంచి మహిళా రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్న కాంగ్రెస్ ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సోనియా గాంధీ హాజరు కానున్నట్లు తెలిపింది.

Read More..

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే! (వీడియో)

Next Story