- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ మద్యం షాపుల డ్రాలో సత్తా చాటిన మహిళలు
దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ(New Liquor Policy)లో భాగంగా.. 3,396 మద్యం షాపుల(liquor shops)కు ప్రభుత్వం డ్రా పద్దతితో లైసెన్సులు ఇచ్చింది. డ్రాలో పేరు వచ్చిన వారు 24 గంటల్లో మొత్తం డబ్బులు డిపాజిట్ చేయాలని ప్రభుత్వం రూల్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు జరిగిన డ్రా పద్దతితో.. మద్యం షాపులను దక్కించుకున్న వారిలో మహిళలు సత్తా చాటారు. మొత్తం 3,396 మద్యం షాపులకు డ్రా తీయగా.. ఇందులో 345 షాపులు మహిళ పేరు మీద వచ్చాయి. అంటే మొత్తం షాపుల్లో 10.2 శాతం మహిళలకు లిక్కర్ షాపుల లైసెన్సులు దక్కాయి. తాజాగా నివేదిక ప్రకారం.. లిక్కర్ లైసెన్స్ పొందిన మహిళలు జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా వైజాగ్ లో 31 మద్యం షాపులు దక్కించుకోగా.. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో ఒక మహిళకు వైన్ షాప్ లైసెన్స్ దక్కింది. కాగా ఈ కొత్త మద్యం పాలసీ ఏపీ రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీంతో గతంలో అందుబాటులో ఉన్న బ్రాండ్‌లు కాకుండా.. 2019కి ముందు అందుబాటులో ఉన్న మద్యాన్ని ప్రజలకు అందించనున్నారు.