బిగ్ బ్రేకింగ్.. జింఖానా గ్రౌండ్స్‌లో టికెట్ల లొల్లి.. తొక్కిసలాటలో మహిళ మృతి..?

by Disha Web Desk 14 |
బిగ్ బ్రేకింగ్.. జింఖానా గ్రౌండ్స్‌లో టికెట్ల లొల్లి.. తొక్కిసలాటలో మహిళ మృతి..?
X

దిశ, వెబ్‌డెస్క్ జింఖానా గ్రౌండ్‌లో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, క్రికెట్ అభిమానులు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడ ఏర్పడిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందినట్లు సమాచారం. అయితే ఆదివారం జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు భారీ సంఖ్యలో జింఖానా గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. భారీగా అభిమానులు రావడంతో అక్కడ తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేసే సందర్భంగా క్రికెట్ అభిమానులకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఇది కాస్త లాఠీఛార్జ్‌గా మారడంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త నెలకొంది. తొక్కిసలాటకు దారితీసింది. ఈ క్రమంలో గేటు దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె సృహ తప్పిందని, అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడించిందని సమాచారం. అంతేకాకుండా ఈ తొక్కిసలాటలో మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి.

Next Story

Most Viewed