ఈ రాత్రికి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతా.. : బండ్ల గణేష్

by Disha Web Desk 4 |
ఈ రాత్రికి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతా.. : బండ్ల గణేష్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తనకు ముందే తెలుసని ఈ రాత్రికి తాను ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతానని ప్రముఖ ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో బుధవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన బండ్ల గణేష్.. ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని, రేవంత్ రెడ్డినే సీఎం కాబోతున్నారని గతంలో చెప్పారు.

డిసెంబర్ 9న రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారని నేను 7వ తేదీననే ఎల్బీ స్టేడియంలో ఉండిపోతానని గతంలో చెప్పారు. అయితే మూడు రోజుల ముందుగానే సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా తాను ఇవాళ రాత్రి నుంచి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతానన్నారు. 200 పర్సెంట్ ఈ రాత్రికి తాను స్టేడియంలోనే ఉంటానన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం తనకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ చాలా కష్టపడ్డారన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని, తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదన్నారు. కేవలం పార్టీ కోసం పని చేశానని చెప్పారు.

Next Story