బీసీ కులగణన ఎందుకు జరగడం లేదు? : R. S. Praveen Kumar

by Disha Web Desk 4 |
బీసీ కులగణన ఎందుకు జరగడం లేదు? : R. S. Praveen Kumar
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో 90 ఏళ్లుగా బీసీ కులాల జనాభా లెక్కలు లేవని, నిరుద్యోగం, వెనుకబాటుతనం, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ ప్రాతినిధ్యం తెలుసుకోవాలంటే జనాభా లెక్కలే కదా ఆధారమని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు. 1931 బ్రిటిష్ పాలనలో కులాల వారీగా జనాభా గణన జరిగిందని, 77 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో బీసీ కులగణన ఇప్పటికీ ఎందుకు జరగడం లేదు? అని ప్రశ్నించారు. కుల గణన చేయకుండా కుట్రలు చేస్తున్నది ఎవరు? అని నిలదీశారు.

బీసీ ప్రధాన మంత్రిగా చెప్పుకునే మోడీ కుల గణన ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించారు. 2014లో తెలంగాణలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా ఎంత? ఈ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు? అని ప్రశ్నించారు. జనాభాలో పిడికెడు మంది లేని ఆధిపత్య కులాల దొరల చేతుల్లో రాజకీయ అధికారం పెట్టి, ఇంకెంతకాలం మోసపోదాం? అని ప్రశ్నించారు. ఆధిపత్య పాలకులు ఇచ్చే చిన్నా చితకా రాజకీయ పదవుల కోసం ఆశ పడుతూ ఎన్నాళ్ళు వేచి చూద్దామన్నారు. ఈ దేశంలో అణగారిన వర్గాలకు ఆత్మ గౌరవాన్ని, అధికారాన్ని ఇచ్చే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed