బీజేపీలో ఆందోళనలను ఉసిగొల్పుతున్నదెవరు?

by Mahesh |
బీజేపీలో ఆందోళనలను ఉసిగొల్పుతున్నదెవరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. టికెట్ల కేటాయింపు అంశంపై పార్టీలో ఈ పరిస్థితి నెలకొంది. అసంతృప్తులకు అండగా ఉంటూ పార్టీలో ఆందోళనలకు ఉసిగొల్పుతున్నది ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ టికెట్ల కేటాయింపు అంశంపైనా గందరగోళం జరిగింది. తాజాగా పార్లమెంట్ టికెట్ల అంశంపైనా అదే తీరు కొనసాగుతోంది. పార్టీలో చేరికల విషయంలోనూ రాష్ట్ర నేతల మధ్య సమన్వయం కొరవడినట్లు తెలుస్తోంది. బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎంపీలు రాములు, బీబీ పాటిల్​ బీజేపీలో చేరారు. బీబీ పాటిల్ చేరిక సందర్భంగా విజయ సంకల్ప రథయాత్రల సాకుతో రాష్ట్ర నేతలు కార్యక్రమానికి అటెండ్ అవ్వలేదని సమాచారం. ఢిల్లీలోనే ఉన్న ఓ నాయకురాలు కూడా గైర్హాజరు కావడం హాట్​ టాపిక్​గా మారింది. జహీరాబాద్​ టికెట్​ను బీబీ పాటిల్​కు కాకుండా మరో నేతకు సదరు నాయకురాలు మద్దతు ఇచ్చినట్టు సమాచారం.

ఇదే అవకాశంగా జహీరాబాద్​కు చెందిన కొందరు నేతలు ఆ స్థానాన్ని జైపాల్ రెడ్డికే కేటాయించాలని అతని అనుచరులు.. రాష్ట్ర చీఫ్​ కిషన్​రెడ్డి ఎదుట ఆందోళన చేపట్టారు. జహీరాబాద్​కు బీబీ పాటిల్​పై చేసిందేమీ లేదని విమర్శించారు. అయితే ఈ ఆందోళనల వెనుక ఒక మహిళా నేత హస్తముందనే చర్చ జరుగుతోంది. నిరసన సమయంలో ఆ నాయకురాలి ఇంట్లోనే జైపాల్ రెడ్డి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మరి అసంతృప్తులకు అండగా నిలుస్తున్న, ఆందోళనలకు ఉసిగొల్పుతున్న వారిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. ఇదిలా ఉండగా జహీరాబాద్ టికెట్ బీబీ పాటిల్​కే ఫైనల్ కావడంతో జైపాల్ రెడ్డి వర్గీయులు తయనకు సహకరిస్తారా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. వారు సహకరించకపోతే పాటిల్ గెలుపు పై ప్రభావితం పడే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.



Next Story

Most Viewed