కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నాం: సీపీఐ

by Dishafeatures2 |
కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నాం: సీపీఐ
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా కేసీఆర్ పేరు మార్చి, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన తీస్కున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని బుధవారం చేసిన ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ''పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ'' ఇది సుమతీ శతకకారుడు చెప్పిన వాస్తవమని, అయితే జాతీయ పార్టీ పెట్టగానే అభినందించడం కాదని, ఆయన పెట్టిన తర్వాత అది జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతమయ్యే పద్దతుల దిశగా దాని అడుగులు ఉండి ఉన్నట్లయితే వారు నిజమైన అభినందనలు పొందగలరని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రారంభంలో జాతీయ పార్టీగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడినందున అభినందనలు తెలియజేస్తూనే భవిష్యత్తులో కూడా అందరిచేత మన్ననలు పొందాలంటే బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతం చేయడానికి ఉపయోగపడే ఎత్తుగడలు వేయడం ద్వారానే వారు సంపూర్ణమైనటువంటి గుర్తింపు పొందుతారు, వారు ఆశించిన పేరు వస్తుందన్నారు. దీని కోసం వారి కృషి ఉండాలని ఆయన ఆకాంక్షించారు.


Next Story

Most Viewed