- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణను ప్రపంచంలో అత్యుత్తంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్‌నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ (Matrubhumi International Festival of Letters) సదస్సులో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను ప్రపంచంలో అత్యుత్తంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని అన్నారు. సుపరిపాలన ఏడాదిలో ఎంత మార్పు తెస్తుందనేకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఒక ఉదాహారణ అని అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలను, మన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ రైజింగ్ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని.. అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వప్నమని సీఎం రేవంత్ వెల్లడించారు.
తెలంగాణ రైజింగ్.. విజన్ -2050.. దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు కలిసి పని చేయాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చినందున తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని ఎంతగానో ప్రేమిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ జీడీపీ (Telangana GDP) సుమారు 200 మిలియన్ యూఎస్ డాలర్లుగా ఉందని.. 2035 నాటికి దానిని ఒక బిలియన్ యూఎస్ డాలర్లుగా (1 billion US dollars) మార్చాలనుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే మూడు జోన్లుగా విభజించామని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు మేం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. దేశంలోని ముంబయి, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై వంటి నగరాలతో కాకుండా ప్రపంచంలోని ముఖ్య నగరాలైన న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ ఉండాలనుకుంటున్నామని ఈ సమావేశంలో రేవంత్ చెప్పుకొచ్చారు.
అలాగే 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ (Future City) నిర్మిస్తున్నామని.. ఇది భారతదేశంలోని పూర్తి హరిత, పరిశుభ్రమైన, అత్యుత్తమమైన (greenest, cleanest and best) నగరంగా ఉండనుంది. ప్రపంచంలోని మరే నగరంతో పోల్చుకున్నా ఇది సరైన ప్రణాళిక, జోన్లు ఉన్న నగరంగా ఉండనుందిని.. ఇది మొట్టమొదటి నెట్ జీరో సిటీ కానుందని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీలో AI సిటీని (AI City) నిర్మిస్తున్నామని, యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Young India Skill University,), యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. హైదరాబాద్ పర్యావరణ సుస్థిరతకుగానూ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టామని, గత యాభై ఏళ్లుగా కాలుష్యం కోరల్లో చిక్కి మూసీ కనుమరుగయ్యే స్థితికి చేరిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి పూర్వ వైభవం తేవాలనుకుంటోందని గోదావరి నీటిని మూసీలో కలపడం ద్వారా త్రివేణి సంగమంగా ఏర్పడుతుందని.. అక్కడే 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ (Gandhi Sarovar)ను నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పుకొచ్చారు.