ఆ ఆఫీసర్ మీద ఆధార పడనక్కర్లేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
ఆ ఆఫీసర్ మీద ఆధార పడనక్కర్లేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. లోపభూయిష్టమైన డిజైన్, నిర్వహణ లోపాలకు బాధ్యతులు ఎవరు అని ప్రశ్నించారు. కాళేశ్వరం వైఫల్యంలో నాటి ప్రభుత్వ అధినేత కేసీఆర్ బాధ్యత ఎంత ఉందో నాటి బీఆర్ఎస్ సర్కార్ కు తొత్తులుగా వ్యవహరించిన ఇంజనీరింగ్ అధికారులకు అంతే బాధ్యత ఉందన్నారు. ఈఎన్సీ మురళీధర్ రావును విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగి అయిన మురళీధర్ రావు మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు.

ఇవాళ గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్లాంట్ లపైనే రూ. లక్ష కోట్లకు మించి అవినీతి జరిగిందన్నారు. ఈ మూడింటిపై జ్యుడీషియల్ విచారణ చేయాలన్నారు. కాళేశ్వరంపై న్యాయవిచారణను బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని ఇందుకు బీజేపీ కూడా వారికి సపోర్ట్ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్ అయితే మోసగాడు కేటీఆర్ అని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయలేదని నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 420 అని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దళిత సీఎం, దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇలా అన్ని హామీలు ఇచ్చి బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు.



Next Story

Most Viewed