- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జలమండలి ఆన్‌లైన్ సేవలు.. 155313 మళ్లీ అందుబాటులోకి
by Ramesh Naini |
జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 155313 IVRS సాంకేతిక లోపం కారణంగా గురువారం ఉదయం తాత్కాలికంగా పని చేయలేదు. ఈ సమస్యను బీఎస్ఎన్ఎల్ సాంకేతిక బృందం అత్యవసరంగా పరిష్కరించే చర్యలు చేపట్టింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 155313 IVRS సాంకేతిక లోపం కారణంగా గురువారం ఉదయం తాత్కాలికంగా పని చేయలేదు. ఈ సమస్యను బీఎస్ఎన్ఎల్ సాంకేతిక బృందం అత్యవసరంగా పరిష్కరించే చర్యలు చేపట్టింది. దీంతో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా నీటి ట్యాంకర్ బుకింగ్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని జలమండలి సూచించింది. అయితే సాయంత్రం ఆన్ లైన్ సేవలను పునరుద్ధరించినట్లు జలమండలి ప్రకటించింది. జలమండలి, బీఎస్ఎన్ఎల్ సాంకేతిక బృందం సమన్వయంతో సమస్యను అత్యవసరంగా పరిష్కరించడంతో అన్ని ఫోన్ లైన్లు సాధారణంగా పనిచేస్తున్నాయని జలమండలి వెల్లడించింది. వినియోగదారులు తిరిగి 155313 నెంబర్ ద్వారా తమ ఫిర్యాదులు, సేవలు, సమాచారం పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.
Next Story






