కేటీఆర్ స‌భ స‌జావుగా సాగేనా..?

by Dishaweb |
కేటీఆర్ స‌భ స‌జావుగా సాగేనా..?
X

దిశ‌, ములుగు ప్రతినిధి: ములుగు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లా పర్యటన సందర్భంగా బయటపడ్డారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఎదుట టిఆర్ఎస్ పార్టీ నాయకులు తమ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మండలానికి రెండు వేల మందిని తరలించి కేటీఆర్ టూర్ సక్సెస్ చేయాలని మంత్రుల సూచనలకు ములుగు జిల్లాలోని బిఆర్ఎస్ నాయకులు పార్టీలో మాకు విలువలు ఉండటం లేదంటూ వ్యతిరేకించినట్టు,పార్టీలో ప్రాధాన్యం లేదంటూ గిరిజ‌న‌, ఆదివాసీ నేత‌ల్లో అసంతృప్తి ఉన్నట్టు, ములుగు నియోజ‌క‌వ‌ర్గంలో గిరిజ‌నేత‌ర నాయ‌కుల పెత్త‌నం పెరిగిదంటూ, జిల్లా పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయని, పార్టీ నుండి సస్పెండ్ అయిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ పార్టీ కోసం పనిచేసే నాయకులకు మొండి చేయి చూపిస్తున్నారని విమ‌ర్శ‌లు చేస్తూ మంత్రుల ఎదుట తమ అసహనాన్ని వెల్లబుచ్చారని తెలుస్తోంది.

దీంతో బుధవారం కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసేందుకు మంత్రుల తంటాలు పడుతున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జన సమీకరణ పూర్తిస్థాయిలో జరిగేనా అని పార్టీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నేత‌ల నుంచే నిర‌స‌న‌ల బెడ‌ద ఇంచార్జ్ మంత్రి సత్యవతి రాథోడ్ కి మింగుడు పడడం లేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు మంగళవారం మంత్రి సత్యవతి రాథోడ్ రంగంలోకి దిగినట్టు,ములుగు జిల్లా టిఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి అసంతృప్తి నాయకులను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed