కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారంటీలు పక్క : యశస్వినీ రెడ్డి

by Aamani |
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారంటీలు పక్క : యశస్వినీ రెడ్డి
X

దిశ, పెద్దవంగర : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారంటీలు పక్క అమలు చేస్తుందని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినీ రెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గంలో పెద్దవంగర మండల కేంద్రంతో పాటు కాన్వాయ్ గూడెం, గంట్లకుంట, మోత్య తండ, కోరి పల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే రోజు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలన్నారు. పాలకుర్తిలో గత పది సంవత్సరాలలో చేయని అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో చేసి చూపిస్తానని అన్నారు.

యువత ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఎం చేసింది ఒకసారి ఆలోచించాలి. మీ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తే వారు చెబుతున్న పథకాలు అవసరమా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడితే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రతి కార్యకర్త ఈ పది రోజులు కష్టపడి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిరంజన్ రెడ్డి, ముద్దసాని సురేష్,శైలజ నెమురుగొమ్ముల, కమలాకర్ నాయక్,మురళి గౌడ్, సోమన్న, హరికృష్ణ, ముత్యాల పూర్ణ చందర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed