కేయూలో ఉత్తమ పరిశోధనలకు పెద్ద పీఠ: వీసీ

by Dishaweb |
కేయూలో ఉత్తమ పరిశోధనలకు పెద్ద పీఠ: వీసీ
X

దిశ,కేయూ క్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో తెలంగాణా రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవాల సందర్బంగా రిజిస్ట్రార్ ఆచార్య టీ శ్రీనివాస రావు అధ్యక్షతన నిర్వహించిన పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ హాజరయ్యారు. పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం.. బోధన, బోధనేతర ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేడు ఉన్న పోటీ ప్రపంచంలో “మంచి, ఉత్తమ పరిశోధనలకు కాకతీయ విశ్వవిద్యాలయం పెద్ద పీఠ వేస్తున్నదని.. అన్నారు.

విశ్వవిద్యాలయం న్యాక్ పీర్ టీం తన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. బ్రిటిష్ వెల్ష్ యూనివర్సిటీ ల తో అవగాహన ఒప్పందం కుడుర్చుకోవటం గొప్ప పరిణామం అన్నారు. అంతర్జాతీయ సదస్సులు ప్రతీ జూన్/జూలై నెలలో నిర్వహిస్తామని, సెప్టెంబర్ నెలలో ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కు కూడా ఆతిధ్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. బాలికల వసతి గృహాలకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.

విశ్వవిద్యాలయం భూమి ఆవగింజంత కుడా పోనివ్వబోము అని అన్నారు, కాంపౌండ్ గోడ నిర్మాణం, మొదటి రెండవ గేటు ల మధ్య రోడ్డు విస్తరణ, దినసరి వేతన ఉద్యోగుల వేతనాల పెంపు, పీఆర్సి అమలు, పార్ట్ టైం ఉద్యోగుల కన్వర్షన్, దివ్యంగ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ నిర్మాణం, పీహెచ్‌డీ కేటగిరి-2 ప్రక్రియ పూర్తి అనేవి తన ముందు ఉన్న ముఖ్య అంశాలన్నారు. అనంతరం విశ్వవిద్యాలయ జాతీయ సేవా పధకం వాలంటీర్లు విద్యా హాసిని, అంజలి, కీర్తి, చిరంజీవి, హరిప్రియ, ప్రేమ కుమార్ లు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య టి మనోహర్, ఆచార్య పి మల్లారెడ్డి, ఆచార్య సుమతి ఉమా మహేశ్వరి, డాక్టర్ ఎం నాగేంద్ర బాబు, బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



Next Story