ఆరు హామీలు నెరవేర్చి తీరుతాం : సుప్రియ శ్రీనటే

by Disha Web Desk 8 |
ఆరు  హామీలు నెరవేర్చి తీరుతాం : సుప్రియ శ్రీనటే
X

దిశ,జనగామ : తుక్కుగూడ సభలో సోనియా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలను తప్పకుండా నెరవేర్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ నేషనల్ సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ ఫామ్ చైర్మన్ సుప్రియ శ్రీ నటే తెలిపారు. సోమవారం జనగామలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన గడపగడపకు ఆరు గ్యారెంటీ హామీలు అనే పేరుతో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తుక్కుగూడ వేదికగా ప్రకటించిన హామీలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు అందజేసి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.

ఆరు నూరైనా హామీ లన్నింటినీ కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మహాలక్ష్మి,గృహ జ్యోతి,రైతు భరోసా, యువ వికాస్, చేయూత, పెన్షన్ వంటి పథకాలను పార్టీ తప్పనిసరిగా అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో, పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజా షట్టర్, కళ్యాణ్, విష్ణువర్ధన్ రెడ్డి, పిట్టల సతీష్ తదితరులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story

Most Viewed