కూరగాయలు అమ్మి నిరసన తెలిపిన వీఆర్ఏలు

by Disha Web Desk 4 |
కూరగాయలు అమ్మి నిరసన తెలిపిన వీఆర్ఏలు
X

దిశ, హనుమకొండ టౌన్: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని వీఆర్ఏలు జాతీయ రహదారిపై గూడెపాడు సెంటర్‌లో కూరగాయలను అమ్మి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల జేఏసీ చైర్మన్ వంగేటి సత్యం మాట్లాడుతూ.. వీఆర్ఏల సమ్మె 61వ రోజు రెండు నెలలు దాటినప్పటికీ.. ఈ ప్రభుత్వానికి మా వీఆర్ఏలపైన కనికరం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా పిల్లల భవిష్యత్తు కోసం మా కడుపు పుట్ట కోసం కూరగాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దసరా లోపు మా కోరికలు నెరవేర్చాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

శాంతియుతంగా ధర్నా చేస్తున్నప్పటికీ మమ్ములను పోలీస్ స్టేషన్ పిలిపించుకొని మా ఇన్ఫర్మేషన్ తో పాటు మా కుటుంబ సభ్యులు, బంధువుల ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం మా మీద ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ఆయన మండిపడ్డారు. దసరాలోపు మా సమస్యలు పరిష్కరించి పే స్కేల్ జీవో విడుదల చేయకుంటే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో వీఆర్ఏలకు కన్వీనర్ జంగా శ్రీకాంత్, సతీష్ , ప్రభాకర్, రవి, బోయిని, మల్లయ్య , మేడే కృష్ణమూర్తి, నాగిల్లి మాధవి, కన్నం చేరాలు, నిమ్మల సాంబయ్య, సూరయ్య, పాండవుల రవి, చంద్రమౌళి, లక్ష్మయ్య, సారయ్య, కట్టమల్లు, నరసింహ, రాములు తదితర వీఆర్ఏలు పాల్గొన్నారు.


Next Story