సమగ్ర విచారణతోనే తొలగింపులు.. జిల్లా కలెక్టర్ శశాంక

by Disha Web Desk 20 |
సమగ్ర విచారణతోనే తొలగింపులు.. జిల్లా కలెక్టర్ శశాంక
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : ఓటుహక్కు తొలగింపులో ముందస్తుగా సమగ్ర విచారణ జరపాలని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఓటుహక్కు తొలగింపునకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఓటర్ల జాబితా రూపకల్పనలో మార్పులు చేర్పులు తొలగింపు ప్రక్రియల పై హైదరాబాదు నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారివికాస్ రాజ్ మరో ఎన్నికల అధికారి రవికిరణ్ తో కలిసి జిల్లాకలెక్టర్లతో ఓటర్ల జాబితా రూపకల్పన పై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు మాట్లాడుతూ ఓటు హక్కు తొలగింపులో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులచే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఓటుహక్కు తొలగింపులో పూర్తి సమాచారం సేకరించిన తర్వాతనే ఓటుహక్కు తొలగింపు వాస్తవం అని నిర్ధారించుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలన్నారు.

అనంతరం కలెక్టర్ నివేదిస్తూ ప్రతివారం అఖిలపక్ష పార్టీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తొలగింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఓటు హక్కు నమోదు (ఏపిక్ ) కార్డు పంపిణీ ప్రక్రియను కూడా తెలియజేస్తామన్నారు. జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయని ఒకటి మహబూబాబాద్ కాగా రెండవది డోర్నకల్ గా తెలియజేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారు 7వేల దరఖాస్తులు ఉన్నాయని పరిశీలన కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ డేవిడ్, మహబూబాబాద్ ఆర్డీవో కొమరయ్య, తొర్రూరు ఆర్డీవో ఎల్.రమేష్ లు, మహబూబాబాద్, మరిపెడ తహశీల్దార్లు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ వి.రాఘవ రెడ్డి, డీటీ. గణేష్, ఎన్నికల విభాగం సిబ్బంది రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed