ఎన్నికల్లో కష్టపడిన నాయకులకే స్థానిక ఎన్నికల్లో టికెట్

by Sridhar Babu |
ఎన్నికల్లో కష్టపడిన నాయకులకే స్థానిక ఎన్నికల్లో టికెట్
X

దిశ, హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి చేరవేయడంలో కాంగ్రెస్ నాయకులు విఫలం అవుతున్నారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజల్లోకి ఎందుకు చేరవేయడంలేదని కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యే రేవూరి ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఐదు వందలకే గ్యాసు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇలాంటివి ఎన్నో చేసిన ప్రజల్లోకి ఎందుకు చేరవేయడం లేదని కాంగ్రెస్ నాయకుల పై ఎమ్మెల్యే మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్యపు ప్రచారాలు తొందరగా చేరుతుంటే కాంగ్రెస్ పార్టీ చేసే మంచి ఎందుకు ప్రజల్లోకి చేరడం లేదని కాంగ్రెస్ నాయకులు ఎందుకు అడ్డుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

పరకాల నియోజకవర్గానికి 3700 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, అదనంగా ఇంకా 700 ఇండ్లను తీసుకొస్తానని గత ప్రభుత్వంలాగా కాకుండా అర్హులైన వారికి ఈ ఇండ్లను ఇస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏనాడూ రైతులను చిన్నచూపు చూడలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని అన్నారు. ఎమ్మెల్యే రేవూరి సమావేశంలో మాట్లాడుతుండగా ఓ ముఖ్య నాయకుడు స్టేజీ పైనే నిద్రిస్తున్నా పట్టించుకోవడంలేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య, వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఆత్మకూరు, దామెర మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Next Story