- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఫ్యాన్లతో సహా ఊడిపడిన ఇంటి కప్పు

దిశ, నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలో మంగళవారం అర్ధరాత్రి అకాల వర్షానికి తోడు వచ్చిన గాలి దుమారానికి డివిజన్ వ్యాప్తంగా పలు ఇండ్ల పై కప్పులు లేచిపోయాయి. మండలాల వారీగా రేకుల ఇంటి కప్పులు ఉన్న పలువురి పరిస్థితి దారుణంగా తయారైంది. చెన్నారావుపేట మండలంలోని ధర్మతండా గ్రామపంచాయతీకి చెందిన బాధావత్ కిషన్ - విజయ దంపతులు అర్ధరాత్రి వచ్చిన గాలి దుమారానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంటి పై కప్పులు ఫ్యాన్లతో సహా లేచిపోయి పక్కకు పడడంతో పెను ప్రమాదం తప్పింది.
వెంటనే మేల్కొన్న దంపతులు ఏం చేయాలో దిక్కుతోచక పక్కింట్లో తలదాచుకున్నారు. రూ.2 లక్షలు ఖర్చుపెట్టి రేకుల షెడ్డు నిర్మించుకున్నామని ఇంతలో గాలి దుమారంతో ఇల్లు కూలిపోయిందని, ప్రజాప్రతినిధులు అధికారులు, ప్రభుత్వం ఆదుకోవాలని దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నారావుపేట బంకు సమీపంలో ఉన్న దాసరి వెంకటేష్ వెల్డింగ్ షాపు సైతం రాత్రి వచ్చిన గాలి దుమారానికి, పై కప్పు మొత్తం లేచిపోయి విద్యుత్ వైర్లు తెగిపోయాయి. షాప్ లో ఉన్న మిషన్స్, ధ్వంసం అయ్యాయి. ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు స్పందించి, ఆదుకోవాలని కోరుతున్నారు.