- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాటారం ఫర్టిలైజర్ షాపుల్లో టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మిక తనిఖీలు
కాటారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుల్లో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

దిశ, కాటారం : కాటారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుల్లో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయా షాపుల్లో మండల వ్యవసాయ అధికారి పూర్ణిమ స్టాక్ నిర్వహణ రికార్డులను, ఎరువుల బస్తాల లాట్ నెంబర్లు, సోర్స్ సర్టిఫికేట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి పూర్ణిమ మాట్లాడుతూ వ్యాపారులు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు ప్రభుత్వం ఆమోదం పొందిన షాపుల్లోనే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు సమయలో రశీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే వ్యాపారుల లైసెన్సులు సీజ్ చేస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై నిఘా ఉంచామన్నారు. ఫర్టిలైజర్ షాపు యజమానులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయాలని తెలిపారు, ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే రైతులు, ప్రజలు స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో, వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమాచారం అందించాలన్నారు. సమాచారం తెలియజేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు






