ఆ నియోజక వర్గంలో సర్వేల కలకలం.. ప్రజా తీర్పు ఎటువైపంటే?

by Dishanational2 |
ఆ నియోజక వర్గంలో సర్వేల కలకలం.. ప్రజా తీర్పు ఎటువైపంటే?
X

దిశ, మరిపెడ : రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైనట్టే అనిపిస్తుంది. కొన్ని రాజకీయ పార్టీలు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఎమ్మెల్యేల పనితీరు, అభివృద్ధి, వివిధ కోణాల్లో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటాయి. ప్రస్తుతం డోర్నకల్ నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ సర్వే సంస్థ ప్రతినిధులు రావడంతో అధికార,ప్రతిపక్ష పార్టీలలో ఒక్కింత ఆందోళన మొదలవుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలో రెండు గ్రూపులు ఉండడంతో ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్యానాయక్ , మంత్రి సత్యవతి రాథోడ్ లల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీలో నెహ్రు నాయక్, రామచంద్రనాయక్ లల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అని అడుగుతుండడంతో ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్వేన లేకపోతే హస్తం పార్టీ కి సంబంధించిన సర్వేన అని నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనితోపాటు ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో? తమకు అనుకూలంగా ఉంటుందా లేక వ్యతిరేకంగా ఉంటుందో అని ఈసారి ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో? అని ఇరుపక్షాల ఎమ్మెల్యే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్టు ప్రాధమిక సమాచారం. ప్రధానంగా ఎమ్మెల్యేల అభ్యర్థుల పైన , వారి పనితీరుపైన, తర్వాతి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది. అని ప్రజల అభిప్రాయాన్ని సర్వే సంస్థ ప్రతినిధులు తెలుసుకుంటున్నారు. ఈ సర్వే వల్ల ఎవరికి నష్టమో ఎవరికీ లాభమో వేచి చూడాలి.



Next Story