అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి సబ్ రిజిస్ట్రార్ చేయుత

by Disha Web |
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి  సబ్ రిజిస్ట్రార్ చేయుత
X

దిశ, ములుగు ప్రతినిధి: అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబానికి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ఆసరాగా నిలిచారు. ములుగు మండలం సర్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జగ్గన్న గూడెం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన పెనుక వెంకన్న ఇల్లు విద్యుత్ ఘాతంతో పూర్తిగా కాలిపోయి నేలమట్టమైంది. దీంతో ఆ కుటుంబం సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న తస్లీమా గురువారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో అన్ని కోల్పోవడం బాధాకరమని, వస్తు రూపంలో నష్టం జరిగినా మనుషులకు ఎలాంటి హాని జరగకపోవడం మంచిదని, ఇలాంటి సందర్భాల్లో ధైర్యంగా ఉండాలని తస్లీమా అన్నారు. సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు, బియ్యం, నిత్యావసర సరుకులు అందించి సహృదయాన్ని చాటుకున్నారు.

Next Story

Most Viewed