- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బయోమెట్రిక్ పెట్టు..కాలేజీకి డుమ్మా కొట్టు..
దిశ,తొర్రూరు: విద్యార్థులకు చదువు చెప్పాల్సిన లెక్చరర్లు కాలేజీ సమయంలో రూల్స్ ప్రకారం బయోమెట్రిక్ వేసి డుమ్మా కొట్టి పెళ్లిళ్ల కి అటెండ్ అవుతున్నారు.మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని జూనియర్ కాలేజీలో లెక్చరర్ల వివాదాస్పద తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.13 మందికి 9 మంది లెక్చరర్లు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి, తమ విధులను పక్కనపెట్టి పెట్టి కాలేజీ ప్రిన్సిపాల్ కొడుకు వివాహ రిసెప్షన్‌కు వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.విద్యార్థి సంఘాల ఫిర్యాదులపై ఆర్జేడీ ఆదేశాల మేరకు జిల్లా ఇంటర్ విద్యా అధికారి (డీఐఒ) మదార్ ఖాన్ జూనియర్ కాలేజీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు, బయోమెట్రిక్ హాజరు వివరాలను పరిశీలించి, లెక్చరర్ల చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రారంభ నివేదిక సమర్పణ..
డీ ఐఒ మదర్ ఖాన్ మాట్లాడుతూ, ఈ అంశంపై పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆ నిర్ణయాల ఆధారంగా సంబంధిత అధికారుల నుండి చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.
విద్యార్థి సంఘాల డిమాండ్..
లెక్చరర్ల ఈ తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విధులను పక్కనబెట్టి రిసెప్షన్‌కు వెళ్లడం లాంటి ఘటనలు విద్యార్ధుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాసంస్థల్లో క్రమశిక్షణ పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు.