బాలికలపై దాడులు చేస్తే కఠిన చర్యలు: మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్

by Disha Web |
బాలికలపై దాడులు చేస్తే కఠిన చర్యలు: మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్
X

దిశ, పాలకుర్తి: మహిళలు స్వశక్తితో ముందుకుసాగాలని మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు అన్నారు. కొడకండ్ల మండల కేంద్రంలో శ్రీనిధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుశిక్షణ కేంద్రాను మంగళవారం ప్రారంభించారు. పాలకుర్తి, చెన్నూర్, గూడూర్ గ్రామాలలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను మంత్రి పరిశీలించారు. చెన్నూర్ పాఠశాలలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కొరకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దపెడుతుందన్నారు. సీఎం కేసీఆర్ మహిళలు ఆర్ధికంగా బలోపేతం కావాలని.. శ్రీనిధి ద్వారా రుణాలు అందిస్తున్నారని చెప్పారు. బాలికలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికల విద్యకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దేశంలో లేని విధంగా ప్రత్యేకంగా రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బాలికల రక్షణకు, బాలికల భ్రూణ హత్యల నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నాయకత్వంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.


Next Story