గ‌త ప‌దేళ్లు చీక‌ట్లో మ‌గ్గిన స్టేష‌న్ ఘ‌న‌పూర్ కు కాంగ్రెస్ పాల‌న‌లో విద్యుత్ వెలుగులు : డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

by Nallavelli.Anjaneyulu |

గ‌త ప‌దేళ్లు చీక‌ట్లో మ‌గ్గిన స్టేష‌న్ ఘ‌న‌పూర్ కు కాంగ్రెస్ పాల‌న‌లో విద్యుత్ వెలుగులు నింపుతుంద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

గ‌త ప‌దేళ్లు చీక‌ట్లో మ‌గ్గిన స్టేష‌న్ ఘ‌న‌పూర్ కు కాంగ్రెస్ పాల‌న‌లో విద్యుత్ వెలుగులు :   డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క
X

దిశ, ధర్మసాగర్ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో రూ.60.62 కోట్ల వ్యయంతో నిర్మించిన 1 132/33 కేవీ, ఆరు 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క మాట్లాడుతూ రూ.62 కోట్లకు పైగా నిధులతో ఒకేసారి ఏడు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తీసుకున్న నిర్ణయం రైతాంగానికి చారిత్రాత్మక మద్దతుగా నిలిచిందన్నారు. అదే సంక్షేమ స్ఫూర్తిని కొనసాగిస్తూ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ వారి ఆర్థిక భారాన్ని తగ్గిస్తోందని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందుతున్నాయని, సంక్షేమం మరియు అభివృద్ధి అనే రెండు కళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి సుమారు రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని, రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అనంతరం ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, గత పదేళ్లుగా స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి చీకట్లో మగ్గిపోయిందని, ప్రజల అవసరాలను పట్టించుకోని పాలన కారణంగా విద్యుత్ మౌలిక సదుపాయాలు కూడా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఎంపీ డాక్టర్ కడియం కావ్య విమర్శించారు. నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాయకత్వంలో స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి వెలుగులు నింపుకుంటూ కొత్త దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.ప్రజల అవసరాన్ని గుర్తించి అడిగిన వెంటనే ఏడు సబ్‌స్టేషన్లకు ఆమోదం తెలిపిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కి ఎంపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రమాదకర రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఓటు హక్కును బలహీనపర్చే కుట్రలను ప్రజలు అప్రమత్తంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మామిడాల యశస్విని రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, కోఆపరేటివ్ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story