పండుగ‌లా రాష్ట్రావ‌త‌ర‌ణ, ద‌శాబ్ది ఉత్సవాలు: మంత్రి ఎర్ర‌బెల్లి

by Disha Web Desk 23 |
పండుగ‌లా రాష్ట్రావ‌త‌ర‌ణ, ద‌శాబ్ది ఉత్సవాలు: మంత్రి ఎర్ర‌బెల్లి
X

దిశ,జనగామ: తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ ద‌శాబ్ధి ఉత్స‌వాలు ప్రతి పల్లె పల్లెలో పండుగలా నిర్వహించాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులను అదేశించారు. పాలకుర్తి నియోజకవర్గం విస్తరించి ఉన్న జనగామ, వరంగల్,మహబూబాబాద్ జిల్లాల అన్ని శాఖల అధికారులను మంత్రి పాలకుర్తిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేకంగా గురువారం సమీక్ష చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ,తెలంగాణ ఆవిర్భావ ద‌శాబ్ధి ఉత్స‌వాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలి. ఘ‌నంగా నిర్వ‌హించాలి. పండుగ‌లా జ‌ర‌గాలి. ఇందుకు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు,ప్రుజ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వ‌ర‌కు 21 రోజుల పాటు నిర్వ‌హించే అన్ని ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాలన్నారు. మన రాష్ట్రం దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంది. అన్ని శాఖ‌ల్లో అనేక అవార్డులు సాధించాం. ఈ వేడుక‌ల‌ను విజ‌యోత్స‌వంగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. మిగ‌తా శాఖ‌ల‌కు భిన్నంగా ఎక్కువ శాఖ‌ల‌తో మ‌న‌కే ఎక్కువ అనుబంధం ఉంది. అందుకే ఆయా ఉత్స‌వాల‌ను నిర్వ‌హించే బాధ్య‌త మ‌న‌పై ఎక్కువ‌గా ఉంద‌ని సూచించారు.

21 రోజుల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,మంచినీటి సరఫరా శాఖలు ఎక్కువ భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తూనే పాలకుర్తి నియోజకవర్గం లో ప్రత్యేకంగా మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు. ఈ స‌మీక్ష‌లో జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, డి ఆర్ డి ఓ రాంరెడ్డి ఏపీ డి నూరుద్దీన్, వివిధ శాఖల అధికారులు పంచాయతీ అధికారి ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ నీటిపారుదల విద్యా వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ విద్యుత్ వైద్య ఆరోగ్యం పారిశ్రామిక రెవెన్యూ డ్వాక్రా గిరిజన వివిధ సంక్షేమ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు నియోజకవర్గ వ్యాప్తంగా నేతలు పాల్గొన్నారు.


Next Story