రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Disha Web Desk 11 |
రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ, మహబూబాబాద్ టౌన్: రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని ప్రజా రంజక పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో దీన దయాల్ ఉపాధ్యాయ పంచాయత్, సతత్ వికాస్ పురస్కార్, జిల్లాస్థాయి అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పురస్కారం బాధ్యతలను మరింత పెంచుతాయన్నారు. మిగతా గ్రామపంచాయతీ లు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి కోరారు.

వాస్తవాలను గమనిస్తే గతంలో సర్పంచులకు మంజూరైన నిధులు సరిపోయేవి కావని అరకొర నిధులు తాగునీరుకే ఖర్చు చేయడం జరిగేది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథ తో తాగునీటికి శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. అభివృద్ధిలో భాగంగా అవార్డులు సాధించిన 27 గ్రామపంచాయతీలలో 72 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. అనంతరం అవార్డులు సాధించిన 27 మందిని మంత్రులు ప్రజాప్రతినిధులు, అధికారులు పురస్కారాలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, జడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు, జిల్లా కలెక్టర్ శశాంక, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్ డీఏపీడీ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed