- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎస్సారెస్పీ నీరు ప్రతి ఎకరానికి అందిస్తాం
by Sridhar Babu |

X
దిశ, నెల్లికుదురు : మానుకోట జిల్లాలో ప్రతి ఎకరానికి ఆఖరి మడి వరకు ఎస్సారెస్పీ నీరు అందాలని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లికుదురు,కేసముద్రం మండలాల కాంగ్రెస్ నాయకులు ,రైతులు కెనాల్ మట్టి చెత్తాచెదారంతో నిండి ఉండడంతో తమ చివరి ఆయకట్టు వరకు నీరు రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
దీంతో ఎమ్మెల్యే సంబంధిత నాయకులను వెంట తీసుకొని ఆదివారం వరంగల్ తీగరాజుపల్లి ఎస్సారెస్పీ డీబీఎం 40 కాల్వను సందర్శించి పరిశీలించారు. నెక్కొండ సమీపంలో కాల్వలో పేరుకుపోయిన పూడిక మట్టి, చెత్త తొలగించడానికి ఎమ్మెల్యే తన సొంత డబ్బులు వెచ్చించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు గుగులోతు బాలాజీ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్ వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.
Next Story