రాజుల కొత్తపల్లి"ఎస్ఎంసి" ఎన్నికకు రాజకీయ గ్రహణం

by Disha Web |
రాజుల కొత్తపల్లిఎస్ఎంసి ఎన్నికకు రాజకీయ గ్రహణం
X

దిశ, నెల్లికుదురు: పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ప్రైవేటుకు దీటుగా విద్య ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం బోధన చేపట్టాలని లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం తీసుకువచ్చింది. సరస్వతి నిలయాలలో సైతం ఎస్ఎంసి ఎంపికలో రాజకీయ రంగు పులుముకోవడం తో మండలంలోని రాజుల కొత్తపల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు. చైర్మన్ ఎన్నిక ఏళ్లు గడిచిన వాయిదా పడుతూనే ఉంది. దీంతో మన ఊరు మనబడి పథకంలో సంబంధిత పాఠశాల ఎంపికైనప్పటికీ పాఠశాలకు చైర్మన్ లేకపోవడంతో స్కూల్‌లో అభివృద్ధి పనులు మొదలు పెట్టడం లేదు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే విద్యాభ్యాసం చేస్తున్నారు.

వీరికి మంచి వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం కంకణం పెట్టుకున్నప్పటికీ చైర్మన్ ఎన్నికల్లో రాజకీయాలు చోటు చేసుకోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక నాయకుల వ్యవహార శైలి పట్ల రుసర్సలాడుతున్నారు. అభివృద్ధి చేయడంలో పోటీ పడాలి కానీ విజ్ఞానాన్ని అందించే విద్యాలయాలలో రాజకీయాలు ఛోపించి చోద్యం చూస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, మేధావులు,యువకులు విద్యా వికాసానికి కోరే శ్రేయోభిలాషులు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధి కోసం ఎస్ఎంసి ఎన్నిక నిర్వహించి మన ఊరు మనబడి అభివృద్ధి నిధులను వినియోగించుకునే విధంగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.


Next Story