గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్‌‌లో స్టోర్ రూంలో షార్ట్ సర్క్యూట్..

by Disha Web Desk 23 |
గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్‌‌లో స్టోర్ రూంలో షార్ట్ సర్క్యూట్..
X

దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండ లోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల (గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ )లోని స్టోర్ రూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టోర్ రూమ్ లోని బ్లీచింగ్ పౌడర్, చీపుర్లు, ఇతర సామగ్రి దగ్ధమైంది. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కాగా ఈ ఘటనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు హనుమకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎల్ రమేష్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ లో ప్రమాదానికి గురైన స్టోర్ రూమ్ ను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. ఘటనకు సంబంధించిన వివరాల నివేదికను జిల్లా కలెక్టర్ కి అందజేయనున్నట్లు ఆర్డీవో తెలిపారు.Next Story

Most Viewed