'హ‌రిత‌హారం మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలి'

by Disha Web |
హ‌రిత‌హారం మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలి
X

దిశ ప్రతినిధి,వ‌రంగ‌ల్ : వరంగల్ సర్కిల్ ప‌రిధిలో తెలంగాణకు హరిత హారం కింద చేపట్టిన అర్బన్ పార్కులను, నర్సరీలను, ఫారెస్ట్‌లో మొక్కల పెంపకంపై అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం వరంగల్ సర్కిల్‌లోని వరంగల్, హన్మకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగాం జిల్లాలో ఆమె ప‌ర్యటించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు రేంజ్ ప‌రిధుల్లో ప‌ర్యటించిన ఆమె తెలంగాణకు హరిత హరం యొక్క లక్ష్యం ఒక కోటి మొక్కలని అన్నారు. అన్ని జిల్లాలలో గుంతలు తీయడం, మొక్కలు నాటడం వేగవంతం చేయాలని అన్నారు. ఆగష్టు నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ కెనాల్స్, బ్లాక్ ప్లాంటేషన్స్ ప్రత్యేకంగా రివ్యూ చేశారు. కార్యక్రమంలో వ‌రంగ‌ల్ స‌ర్కిల్ అట‌వీ అధికారి డాక్టర్ ఆశా, ములుగు జిల్లా అట‌వీ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, భూపాల‌ప‌ల్లి జిల్లా అట‌వీ అధికారిని లావణ్య, హ‌న్మకొండ జిల్లా అట‌వీ అధికారి నాగభూషణం త‌దిత‌రులు పాల్గొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed