అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..

by Disha Web Desk 20 |
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..
X

దిశ, మల్హర్ : మానేరు నది నుంచి ఇసుక స్మగ్లర్లు యదేచ్చగా అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం నేరేడుపల్లి, కొంపెల్లి, గోర్లవేడు, ఎంచరాని, అందుకు తండా, వోడితెల కొత్త పెళ్లి, జడల్ పేట గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులు వందల ట్రాక్టర్లతో రాత్రి పగలు అనే తేడా లేకుండా మల్హర్ మండలం అటవి ప్రాంతం ద్వారా మానేరునది నుండి దర్జాగా ఇసుక రవాణ సాగిస్తున్నారు. భూపాలపల్లి పట్టణంలో ఇండ్ల నిర్మాణాలకు ఇసుక అధికంగా డిమాండ్ ఉండడం వల్ల ట్రాక్టర్ల యజమానులు అక్రమంగా ఇసుక తరలిస్తూ ఒక్కొక్క ట్రాక్టర్కు రూ.5 వేల చొప్పున కాసులు కురిపిస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ రెవెన్యూ, పోలీస్, ప్రజాప్రతినిధులకు మామూలు ముట్ట చెబుతూ ఇసుక అక్రమ రవణ దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖ అధికారి తాడిచెర్ల బీట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అదుపులో తీసుకొని కేసునమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన నాలుగు ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్లను పట్టుకొని సీట్ చేశారు. భూపాలపల్లి ఫారెస్ట్ రేంజ్ ఎఫ్డీఓ ఆదేశాల ప్రకారం ఒక్కొక్క ట్రాక్టర్ కు ఎంత ఫైన్ వేస్తారనేది వారి నిర్ణయం ప్రకారం వదిలేస్తూ ట్రాక్టర్ల సమాచారం పూర్తి నివేదికను అందజేసినట్లు ఎఫ్ ఎస్ ఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Next Story