తప్పుడు పత్రాలతో భూమిని కాజేసిన సర్పంచ్ భర్త

by Disha Web |
తప్పుడు పత్రాలతో భూమిని కాజేసిన సర్పంచ్ భర్త
X

దిశ, శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సాదోని పల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి శ్రీనివాస్, రమేష్ తో పాటు మరి కొందరి భూములను సాధోనిపల్లి గ్రామ సర్పంచ్ భర్త పొడమికల సంపత్‌తో పాటు మామ తప్పుడు సర్వే నెంబర్లు ఎంచుకొని భూమి కాజేసే ప్రయత్నం చేసినట్లు వారు పేర్కొన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం చేరుకొని 20 మంది రైతులు, మహిళలు తహశీల్దార్ రాజుకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా తాతల తండ్రుల నుంచి సంక్రమించిన 15 ఎకరాల భూమి ఉంది. గ్రామ పరిధిలో సర్వే నంబర్ 194 లో భూమి ఉందని పేర్కొన్నారు. అట్టి భూమిని సర్పంచ్ భర్త పొడమేకల సంపత్‌తో పాటు కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో భూమిని కాజేయడానికి సర్వే నెంబర్ మార్చి 194/ఆ /2/1/2/1 ఖాతా నెంబర్ 60307 లో రెండు ఎకరాలు చేయించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా కొంత భూమిని పట్టా నెంబర్లతో కాజేసినట్టు పేర్కొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టా కాలం నుంచి సదరు వ్యక్తులను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


Next Story