కోర్టులో ఆర్టీసీ బస్టాండ్ స్థలం

by Aamani |
కోర్టులో ఆర్టీసీ బస్టాండ్ స్థలం
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మహాదేవపూర్ రహదారిలో బొప్పారం క్రాస్ రోడ్ వద్ద బస్టాండ్ స్థలంలో నిర్మాణం పనులు ప్రారంభించినట్లు ఆర్టీసీ అధికారులు కాటారం పోలీస్ లకు ఇచ్చిన ఫిర్యాదులు ఆరోపించారు. బస్టాండ్ -2 స్థలం పటేదారుకు ఆర్టీసీకి మధ్య కోర్టులో కేసు ఉంది. ఈ స్థలంలో ఎవరు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఉత్తర్వులు ఉన్నప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్థలంలో నిర్మాణం పనుల కోసం కంకర ఇసుక పోసినట్లు ఎలాంటి పనులు జరగకుండా ఎవరిని ఆ స్థలం ఆక్రమణకు గురి కాకుండా చూడాలని కాటారం ఎస్సైకి భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమ దేవి ఫిర్యాదు చేశారు. బస్టాండ్ స్థలం కేసు కోర్టులో ఉన్నందున ఇరు వర్గాలు స్టేటస్ కో అమలు చేయాలని ఆదేశించినట్లు కాటారం సీఐ రంజిత్ రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed