రూ. 389.53 కోట్లతో కేయూ బ‌డ్జెట్‌..

by Disha Web Desk 11 |
రూ. 389.53 కోట్లతో కేయూ బ‌డ్జెట్‌..
X

దిశ‌, కేయూ క్యాంప‌స్: కాకతీయ విశ్వవిద్యాలయ 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 389.53 కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించింది. ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ అధ్యక్షతన సెనెట్ హాల్లో జరిగిన 38 వ అకాడమిక్ సెనెట్ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య టీ శ్రీనివాస రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఏడాది పాటు ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల ఫించన్, పదవి విరమణ భత్యాలు, ఇతర ఖర్చులకు రూ. 209.03 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.16 కోట్లు, ఇతర అకాడమిక్, పరీక్షలు, విద్యార్థుల‌ వసతులు, ఇతరులు కోసం రూ.164.50 కోట్లు కేటాయించారు.

మొత్తం బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయ అంతర్గత వనరుల ద్వారా రూ.370.75 కోట్ల రాబడి వస్తుంద‌ని అంచనా వేశారు. ఖర్చులు, రాబడి వేర్వేరుగా 8 అంశాలలో చూపించారు. అదే సమయంలో రూ.15.47 కోట్ల లోటు ఉంటుంద‌ని తెలిపారు. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్ రూపంలో రూ.127.50 కోట్లు, యూజీసీ పీఆర్‌సీ ఏరియర్స్ నిమిత్తం రూ.32.81 కోట్లు రాబ‌డి ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. అలాగే అంతర్గత నిధులు నుంచి ముఖ్యంగా పరీక్షల విభాగం, అకాడమిక్ ఫీజులు రూ.65.62 కోట్లు ఉండగా ఇతర వనరుల నుంచి రూ. 144.82 కోట్లు స‌మ‌కూరుతాయ‌ని అంచనా వేశారు.



Next Story

Most Viewed