రేగొండ ఎంపీపీపై అవిశ్వాసం..

by Aamani |
రేగొండ ఎంపీపీపై అవిశ్వాసం..
X

దిశ, రేగొండ: ఎంపీపీ పున్నం లక్ష్మి రవి పై అవిశ్వాసం కోరుతూ రేగొండ మండల ఎంపీటీసీ లు సోమవారం ఆర్డీవో రమాదేవికి లేఖను అందజేశారు.మండలంలో మొత్తం 17 మంది ఎంపీటీసీ లు ఉండగా 12 మంది ఎంపీటీసీలు అవిశ్వాసాన్ని కోరుతూ లేఖలో సంతకం చేశారు. మండల పరిషత్ సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస పరీక్ష పెట్టాలని లేఖలో కోరారు. అనంతరం ఎంపీటీసీ లు మాట్లాడుతూ రేగొండ ఎంపీపీ బీసీ బంధు,దళిత బంధు పథకాలను ఉపయోగించుకుని మండల పరిషత్ నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలో చేరాడని అన్నారు.

రేగొండ ఎంపీపీ పదవి ఒక జనరల్ అయినా తండ్రి లాంటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఒక ఉద్యమ కారుడికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పున్నం లక్ష్మీ రవి కి ఎంపీపీ పదవి ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసి పార్టీ కి నమ్మకద్రోహం చేసినందుకే లక్ష్మి రవి పై అవిశ్వాసం పెడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు అయిలి శ్రీధర్ గౌడ్, గండు కుమారస్వామి,హమీద్,జూపాక రమేష్, కేశిరెడ్డి ప్రతాప్ రెడ్డి, శనిగరపు వెంకన్న లు ఉన్నారు.

Next Story

Most Viewed