ఏజెన్సీ ఏరియాలో రియల్ ఎస్టేట్.. పట్టించుకోని అధికారులు

by Disha Web Desk 7 |
ఏజెన్సీ ఏరియాలో రియల్ ఎస్టేట్.. పట్టించుకోని అధికారులు
X

దిశ, బయ్యారం: మండలంలో కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ సామాన్యులు ఉండటానికి గుంట భూమి కొందామంటే అందనంత దూరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రేట్లు పెంచారని మండల కాంగ్రెస్ నాయకులు కంబాల ముసలయ్య, నాయిని శ్రీనివాసరెడ్డి రామచంద్రాపురం ఎంపీటీసీ లక్ష్మి, గణేష్ ఆరోపించారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో డీటీ రవికుమార్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1/70 యాక్ట్ అమలులో ఉన్న బయ్యారంలో భూముల రెట్లకు రెక్కలోచ్చాయని అన్నారు.

బయ్యారం రెవెన్యూ పరిధిలో వ్యవసాయ భూముల్లో రియలెస్టేట్ మాఫియా అక్రమంగా వెంచర్లు వేస్తుంటే రెవెన్యూ అధికారులకు తెలియదా..? ఒకవేళ తెలిస్తే వారిపై చట్టప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. ఇక్కడ వెంచర్లు వేయడానికి పర్మిషన్ లేకపోయినప్పటికీ చట్టాల్ని గౌరవించాల్సిన కొంతమంది.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అక్రమ వెంచర్లు ఏర్పాటు చేయడం దుర్మార్గమని అన్నారు. గుంట భూమిని పది నుండి పదిహేను లక్షలకు అమ్ముతూ.. ప్రభుత్వానికి ఎలాంటి నాలా కన్వర్షన్ టాక్సీ కట్టకుండా, అనుమతి లేకుండా రియలెస్టేట్ మాఫియా పెట్రేగి పోతుంటే నోరు మెదపడం లేదు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతుండడం వల్లనే అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని తెలిపారు. అక్కమంగా వెలిసిన వెంచర్లను ఆపివేయాలని లేనిఎడల మేమే వాటిని అడ్డుకుంటామని బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.



Next Story

Most Viewed